The Unfiltered Me- మార్పు వైపు ప్రయాణం
"ఇంకో 5 నిమిషాలు పడుకుంటా అమ్మా" అని స్కూల్‌కి వెళ్లడానికి బద్ధకించిన రోజుల నుండి, "అయ్యో ఆఫీస్‌కి లేట్ అవుతుంది" అని పరుగు పెట్టే వరకు... అమ్మ చేతి వంట రుచి నుండి, మళ్లీ ఇంటికి ఎప్పుడు వెళ్తానో అని "అమ్మ చేతి వంట గుర్తొస్తుంది" అనుకునే వరకు... నాన్నతో కలిసి ప్రతి రోజూ బయటికి వెళ్లడం నుండి, "నాన్నకు రిటైర్మెంట్ ఇవ్వాలి" అని కలలు కనే వరకు... స్కూల్‌లో అల్లరి చేసిన ఫ్రెండ్స్‌తో "మళ్లీ అసలు ఎప్పుడు కలుస్తాం" అని కన్నీటి వీడ్కోలు వరకు మన జీవితం ప్రయాణించింది. కానీ కొన్నిసార్లు... కాదు కాదు, చాలాసార్లు మనకనిపిస్తుంది... అసలు ఈ ఆఫీస్ అనే ఒక అనవసరమైన రేస్‌లో మనం ఎందుకు ఉన్నామో కూడా తెలియని రోజులు ఇవి. "ఏరా, ఎలా ఉన్నావ్" అని ఒక ఆత్మీయ పిలుపు నుండి "హే, వాట్సాప్ బ్రో" అనే పిలుపుకు వచ్చేశాం. నాకు తెలియకుండానే నా జీవితంలో చాలా మారాయి. కానీ ఎన్ని తలనొప్పులు, టెన్షన్స్‌లో ఉన్నా... ఒక్కసారి మన చిన్ననాటి జ్ఞాపకాలు, మన ఫ్రెండ్స్‌తో కలిసి గుర్తుచేసుకుంటే చాలు... ఈ టెన్షన్స్, డెడ్‌లైన్స్, EMIలు, ఇంట్లో గొడవలు, ఆఫీస్ . అస్సలు ఏమీ గుర్తుకు రావు. నాకైతే తెలియకుండానే నేను ఈ ప్రపంచం నుంచే ఎస్కేప్ అయినట్లు అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా?
👑 మా స్వర్ణయుగం (Childhood Memories) , అసలు ఈ జనరేషన్ వాళ్లకి మన Nokia, BSNL, Celkon మొబైల్స్ విలువ తెలుసు అంటారా? అందులో ఉండే Snake game, Sudokuలు ఎవరికైనా గుర్తొచ్చాయా?
- DVDలు అంటే మనకదొక ఎమోషన్! 3 సినిమాలు కలిపి ఒకే CDలో, షాప్ వాణ్ణి అడిగి మరీ వేయించుకునేవాళ్లం. ఆ CD మీద ఏ సినిమాలు ఉంటాయో ఆ పేర్లు రాసేవాళ్లం కదా?
- పాటల పుస్తకాలు! అసలు వాటి విలువ తెలుసా? 3 రూపాయలు ఉండేది అనుకుంటా. ఆ సినిమాలో ఉండే పాటలు అన్నీ అందులో ఉండేవి. క్లాస్‌లో అందరూ ఆ పాటల పుస్తకాలు తెచ్చుకుని... ఒకరు SP బాలూ, ఇంకొకరు జానకి, సుశీల, రెహమాన్ అయిపోయేవాళ్లం!
- అసలు ఇప్పుడైతే రోజుకి 3GB అయినా సరిపోదు. అదే మనం చిన్నప్పుడు... ఇంటి దగ్గర కిరాణా షాప్‌లో అమ్మని అడిగి, ఏడ్చి, ఎన్నో ప్లానింగ్స్ వేసుకుని రీఛార్జ్ చేయించుకునేవాళ్లం. 500MB కూడా మాకు చాలా ఎక్కువ!
- ఐనా ఈ GenZ గాలకి ఏం అర్థమవుతుంది మన "అనిత ఓ అనిత... నా అందమైన అనిత" అనే పాట విలువ?
ఒక్క మెమరీ అయినా గుర్తొస్తే comment lo rasi 90s loki tisukellandi ra…
Amazing 🤩
ReplyDelete